Houthi terrorists | సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ కత్తిరిస్తాం.. హౌతి ఉగ్రవాదుల వార్నింగ్..!
హమాస్‌కు మద్దతుగా దాడులకు తెగబడుతున్న యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదుల దృష్టి సముద్రగర్భంలోని అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్‌పై పడింది. ఇజ్రాయెల్, అమెరికా.. వాటి అనుకూల దేశాల్ని దెబ్బతీసే విధంగా ఎర్రసముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్‌ను కత్తిరించి వేస్తామని తాజాగా హెచ్చరికలు జారీచేసింది.
- యెమెన్ హౌతీ ఉగ్రవాదుల ప్రకటన
న్యూఢిల్లీ : హమాస్‌కు మద్దతుగా దాడులకు తెగబడుతున్న యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదుల దృష్టి సముద్రగర్భంలోని అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్‌పై పడింది. ఇజ్రాయెల్, అమెరికా.. వాటి అనుకూల దేశాల్ని దెబ్బతీసే విధంగా ఎర్రసముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్‌ను కత్తిరించి వేస్తామని తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఇందుకోసం బాబ్ అల్-మందాబ్ జలసంధి మీదుగా సముద్రగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరించి వేస్తామని బెదిరింపులకు దిగారు. అదే గనుక జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయంటూ సోషల్‌మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎవరీ హౌతీలు?
యెమెన్‌లోని తిరుగుబాటు దళాలే ‘హౌతీ’లు. ఆ దేశ ఉత్తరభాగంలో వీరి ప్రాబల్యం ఎక్కువ. వీళ్లకి ఇరాన్ నుంచి ఆర్థికంగా, సైనికపరంగా మద్దతు అందుతున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకలను టార్గెట్ చేశామని ఇప్పటికే ప్రకటించారు. డ్రోన్లు, క్షిపణులతో నౌకలపై దాడులు చేస్తున్నారు. దీంతో ఎర్రసముద్రంలో నౌకా వాణిజ్యం ప్రమాదంలో పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

