Kanimozhi | వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం : డీఎంకే ఎంపీ కనిమొళి
Kanimozhi | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election)’ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ (DMK MP) కనిమొళి (Kanimozhi) చెప్పారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అందుకే తాము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె తెలిపారు.
Kanimozhi : ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election)’ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ (DMK MP) కనిమొళి (Kanimozhi) చెప్పారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అందుకే తాము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె తెలిపారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు సమాఖ్య హక్కులకు, ప్రజల ఆకాంక్షలకు కూడా విరుద్ధమని అన్నారు.
ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారని, కానీ మీరు వాళ్ల హక్కును దూరం చేస్తారని అనుకోవడం లేదని కనిమొళి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల నుంచి లాక్కుని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు. అలా చేయడం రాష్ట్రాలకు, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు.
కేంద్రం ఆ బిల్లును అమల్లోకి తీసుకొస్తే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. కాబట్టి తాము ఈ బిల్లును అంగీకరించబోమని అన్నారు. ఇవాళ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాంతోపాటే బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించి జేపీసీకి అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

