లక్ష మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లను తయారు చేస్తున్నాం : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లను తయారు చేయాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్కిల్ ఇండియాలో భాగంగా కోవిడ్19 ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం క్రాష్ కోర్సు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 45 ఏళ్లు దాటిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారో.. జూన్ 21వ తేదీ నుంచి 45 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అదే రీతిలో గుర్తింపు ఉంటుందన్నారు. కోవిడ్19 క్రాష్ కోర్సు మూడు నెలల పాటు ఉంటుందని, శిక్షణ పొందిన వారు కోవిడ్ పోరాటంలో అందుబాటులో ఉంటారని ప్రధాని అన్నారు. నర్సింగ్, హోమ్‌కేర్, క్రిటికల్ కేర్, శ్యాంపిల్ కలెక్షన్, మెడికల్ టెక్నీషియన్ లాంటి అంశాలపై క్రాష్ కోర్సులో ఫోకస్ చేస్తారని ప్రధాని వెల్లడించారు. 26 రాష్ట్రాల్లోని 111 సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నారు.
గడిచిన ఏడేళ్లలో వైద్య విద్య, కొత్త ఎయిమ్స్ బిల్డింగ్‌ల నిర్మాణం, వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. వీటిల్లో చాలా వరకు ప్రారంభం అయినట్లు ఆయన చెప్పారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా, ఏఎన్ఎమ్, అంగన్వాడీ, హెల్త్‌కేర్ వర్కర్లను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కోవిడ్ 19 పోరాటం వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కృష్ణ.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

