డెంగ్యూ వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్నాం: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: డెంగ్యూ వ్యాక్సిన్‌కు సంబంధించి మరింత విస్తృతంగా ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బల్రామ్ భార్గవ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాక్సిన్ చాలా ముఖ్యమైందని, కొన్ని డెంగ్యూ స్ట్రెయిన్లపై ప్రస్తుతం ఇండియాలో అధ్యయనం సాగుతోందని, అయితే ఆ కంపెనీలు చాలా వరకు విదేశాల్లో తొలి దశ ట్రయల్స్ చేశాయని, ఇండియాలో ఎక్కువ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఐసీఎంఆర్ చీఫ్ తెలిపారు.
ఇక కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు కోవాగ్జిన్ డేటాను పూర్తిగా సమర్పించినట్లు తెలిపారు. ఆ డేటాను డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే కోవాగ్జిన్‌కు ఎమర్జెన్సీ అనుమతిపై డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం తీసుకుంటుందని డాక్టర్ బల్రామ్ భార్గవ్ తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ రెండు డోసుల టీకా ఇవ్వడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుత దశలో బూస్టర్ డోసు గురించి ఆలోచించడం లేదని ఆయన తెలిపారు.
పండుగ సీజన్ సమీపించిందని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు. సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలన్నారు. కోవిడ్ ప్రవర్తనానియమావళి ప్రకారం పండుగలను సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. కేరళలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు చెప్పారు. దేశంలో ఉన్న కేసుల్లో 52 శాతం యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, తమిళనాడు, మీజోరం, కర్నాటక, ఏపీల్లో అధిక కేసులు నమోదు అవుతున్నాయని రాజేశ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

