PM Modi | వారణాసిలో భయానక పరిస్థితులు.. మోదీకి పోటీగా ఉండనివ్వట్లే!: జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోటీగా బరిలో ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు.
- నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని పలువురు అభ్యర్థులకు బెదిరింపులు
- జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు ఆరోపణ
- వారణాసి స్థానానికి 43 నామినేషన్లు
- ఏకంగా 36 నామినేషన్ల తిరస్కరణ
PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోటీగా బరిలో ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు. వారణాసి ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా దిగుదామనుకొన్న వారిని వారణాసి మేయర్ బెదిరిస్తున్నట్టు మండిపడ్డారు.
నామినేషన్ దాఖలు చేసిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు పేర్కొన్నారు. నామినేషన్ను విత్డ్రా చేసుకోవాలంటూ అర్ధరాత్రి పూట అభ్యర్థుల ఇండ్ల తలుపులు కొడుతున్నట్టు ధ్వజమెత్తారు. ఇవన్నీ చూస్తే, వారణాసిలో భయానక వాతావరణం కొనసాగుతున్నట్టు అర్థమవుతున్నదని వాపోయారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
43 మందిలో.. మిగిలింది ఏడుగురే
వారణాసి ఎంపీ స్థానానికి మంగళవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 43 నామినేషన్లు వచ్చాయి. అయితే, వివిధ కారణాలతో 36 నామినేషన్లను ఈసీ తిరస్కరించింది. తిరస్కరించిన నామినేషన్లలో ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలాది కూడా ఉంది. గురువారం నాటికి ప్రధాని మోదీకి పోటీగా ఆరుగురు మాత్రమే బరిలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

