న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లు(Third Gender) భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. ఎన్నికల సంఘం ఇవాళ ఆ నివేదికను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో ట్రాన్స్జెండర్లు అధిక సంఖ్యలో ఓటు వేశారు. బెంగాల్లో సుమారు 91.28 శాతం ట్రాన్స్జెండర్లు ఓట్లు వేసినట్లు ఈసీ చెప్పింది. ఆ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో 1257 మంది ట్రాన్స్జెండర్లు ఓటేశారు. తొలి దశలో 464, రెండో దశలో 792 మంది ట్రాన్స్జెండర్లు ఓటేశారు. తొలి దశలో ఓటింగ్ 56.79 శాతం, రెండో దశలో 91.28 శాతం మంది ట్రాన్స్జెండర్లు ఓటేశారు.
అయితే పుదుచ్చరిలో అత్యధిక సంఖ్యలో ట్రాన్స్జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చరిలో 91.81 శాతం మంది ట్రాన్స్జెండర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వాడుకున్నారు. పుదుచ్చరిలో మొత్తం 139 మంది ఉండగా, దాంట్లో 91.81 శాతం మంది ట్రాన్స్జెండర్లు ఓటు వేశారు. తమిళనాడులో 7728 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. దాంట్లో ఏప్రిల్ 23వ తేదిన జరిగిన ఎన్నికల్లో 60.49 శాతం మంది ఓటేశారు. ఇక అస్సాంలో 343 మంది ఓటర్లు ఉండగా, దాంట్లో 36.84 శాతం మంది ఓటేశారు. కేరళలో 277 మంది ట్రాన్స్జెండర్లు ఉండగా, 57.04 మంది ఓటేశారు.
2024 లోక్సభ ఎన్నికల్లో థార్డ్ జెండర్ కేటగిరీలో నమోదు చేసిన వారిలో సుమారు 27 శాతం మంది ఓటేశారు. ఆ ఎన్నికల కోసం 48,194 మంది ఆ కేటగిరీలో ఓటు నమోదు చేసుకున్నారు. 2019లో ఆ సంఖ్య 39,075గా ఉంది.