Water Shortage In Delhi | ఢిల్లీలో తీవ్రంగా నీటి కొరత.. కార్లు కడిగితే రూ.2,000 జరిమానా
Water Shortage In Delhi | ఎండలు మండుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశించింది. దీంతో కార్లు కడుగడం వంటివి చేస్తే రూ.2,000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
న్యూఢిల్లీ: ఎండలు మండుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. (Water Shortage In Delhi) ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశించింది. దీంతో కార్లు కడుగడం వంటివి చేస్తే రూ.2,000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా నీటిని వృథా చేస్తే వారికి చలానా విధిస్తామని ప్రకటించారు. కార్లు, ఇతర వాహనాలను కడుగడం, నిర్మాణ, వాణిజ్య ప్రయోజనాల కోసం గృహ సరఫరా నీటిని వినియోగించడాన్ని అనుమతించబోమని పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీలో నీటి వృథాను అరికట్టేందుకు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు
200 బృందాలను జల బోర్డు మోహరించనున్నది. ఉదయం 8 గంటల నుంచి ఈ బృందాలు దేశ రాజధాని ప్రాంతాల్లో తిరిగి నీటి వృథాపై దృష్టిసారిస్తాయి. అలాగే నిర్మాణ స్థలాలు, వాణిజ్య సంస్థల్లో ఉన్న అక్రమ నీటి కనెక్షన్లను నిలిపివేయాలని జల బోర్డు అధికారులను మంత్రి అతిషి ఆదేశించారు. తీవ్ర ఎండలతోపాటు హర్యానా నుంచి నీటి సరఫరా ఆగిపోవడం కూడా నీటి కొరతకు కారణమని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

