Ponmudi | ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీఎంకే నేత పొన్ముడి.. Video
Ponmudi | తమిళనాడుకు చెందిన డీఎంకే నేత పొన్ముడి ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణం చేశారు. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో దిగొచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హాజరయ్యారు.
Ponmudi : తమిళనాడుకు చెందిన డీఎంకే నేత పొన్ముడి ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణం చేశారు. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో దిగొచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హాజరయ్యారు.
#WATCH | Tamil Nadu Governor RN Ravi administers oath to DMK leader K.Ponmudy as a minister in the state cabinet pic.twitter.com/1DcWbBYD5Y
— ANI (@ANI) March 22, 2024
అక్రమాస్తుల కేసులో పొన్ముడికి గతంలో జైలుశిక్ష పడింది. దాంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయింది. తమిళనాడు హైకోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పొన్ముడి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు హైకోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో పొన్ముడి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తమిళనాడు స్పీకర్ ప్రకటించారు.
ఆ వెంటనే సీఎం స్టాలిన్ పొన్ముడి పేరును మంత్రిగా సిఫారసు చేశారు. అయితే అందుకు గవర్నర్ నిరాకరించారు. దాంతో స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టాలిన్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గవర్నర్ ఆర్ఎన్ రవికి గురువారం చీవాట్లు పెట్టింది. తాము ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం లోపు పొన్ముడిని మంత్రిగా నియమించడంపై నిర్ణయం తీసుకోవాలని డెడ్లైన్ పెట్టింది.
దాంతో గవర్నర్ ఆర్ఎన్ రవి దిగొచ్చారు. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు సమ్మతి తెలిపారు. కోర్టు తీర్పును ధిక్కరించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. గత పరిణామాల ఆధారంగానే తాను పొన్ముడితో మంత్రిగా ప్రమాణం చేయించలేదని వివరణ ఇచ్చారు. గవర్నర్ ఆర్ఎన్ రవి పొన్ముడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

