న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఈ మధ్య హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలోని కోట్లాలోని ముబారక్పూర్ ఏరియాలో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి మీదకు ఓ మినీ బస్ వేగంగా దూసుకొచ్చింది. దాంతో ఆ వ్యక్తి భయంతో ఎగిరి బస్ బ్యానెట్పైకి ఎక్కాడు. అయినా డ్రైవర్ ఆపకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. కొంతదూరం తీసుకెళ్లి ఆపేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిపై ఢిల్లీ పోలీసులను ఆరా తీయగా.. ఆదివారం రాత్రి 11.30 గంటలకు తమకు బాధితుడి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. జరిగిన ఘటన గురించి అతను తమకు సమాచారం ఇచ్చాడని, ఎలాంటి గాయాలు కాలేదని చెప్పాడని అన్నారు. స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయమంటే చేయలేదని తెలిపారు.
ఆ తర్వాత తాము కాల్ చేస్తే తాను ఉత్తరప్రదేశ్లో ఉన్నానని, ఫిర్యాదు చేసేందుకు రాలేకపోతున్నానని బాధితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అతను ఫిర్యాదు చేయగానే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
#WATCH | Man dragged on a minibus in Delhi’s Kotla Mubarakpur area last night, police probe underway
(Viral video confirmed by police) pic.twitter.com/GqiUfz9HMH
— ANI (@ANI) December 18, 2023