ముంబై పరేఖ్ హాస్పిటల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. వీడియో
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పరేఖ్ హాస్పిటల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్పిటల్ వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పరేఖ్ హాస్పిటల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్పిటల్ వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు, రోగుల బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఆస్పత్రికి అంటుకుంటాయేమోనని భయంతో వణికిపోయారు.
ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పేశారు. ముంబైలోని ఘట్కోపర్ ఏరియాలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.
#WATCH | Maharashtra: Fire breaks out near Parekh Hospital in Mumbai’s Ghatkopar. Eight fire tenders have reached the spot. Further details awaited: Mumbai Fire Brigade pic.twitter.com/iiKUAIGEAh
— ANI (@ANI) December 17, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

