Watch: ఉదయ్‌పూర్ టైలర్ హంతకులు… పోలీసుల చేతికి ఇలా చిక్కారు!
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 48 ఏళ్ల టైలల్ కన్హయ్య లాల్‌ను మంగళవారం నరికి చంపిన ఇద్దరు హంతకులను ఆ రాష్ట్ర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కన్హయ్య హత్య అనంతరం బైక్‌పై నగరం నుంచి పారిపోతున్న గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీని, ఉదయ్‌పూర్ శివారులోని హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఇద్దరు హంతకులను చుట్టుముట్టి వారిని నిరాయుధులను చేశారు. ఆపై అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తరలించి అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నితిన్ అగర్వాల్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఉదయపూర్ టైలర్‌ను ఊచకోత కోసిన హంతకులిద్దరినీ రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ పోలీసులు సంఘటనా స్థలంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేయాల్సింది ఇంకా ఉంది. ఇది కాంగ్రెస్ పాలిత రాజస్థాన్. సంఘ వ్యతిరేకులను అస్సలు సహించదు’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మ ఒక టీవీ ఇంటర్వ్యూలో మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఉదయ్‌పూర్‌కు చెందిన హిందువైన టైలర్ కన్హయ్య లాల్, ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆయనపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత ఆయనకు బెదిరింపులు వచ్చాయని మృతుడు కన్హయ్య భార్య తెలిపింది.
ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా కన్హయ్యను నరికి చంపినట్లు హంతకులు వీడియోలో పేర్కొన్నారు. ప్రధాని మోదీని కూడా బెదిరించారు. దీంతో ఉగ్రవాద దాడిగా పరిగణించిన కేంద్రం ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. ఇద్దరు హంతకులకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నది.
మరోవైపు మృతుడు కన్హయ్య కుటుంబానికి రూ.31 లక్షల పరిహారంతోపాటు ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయ్‌పూర్‌లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించింది.
राजस्थान पुलिस ने उदयपुर हत्याकांड के दोनों हत्यारों को पकड़ लिया हैं ।
राजस्थान पुलिस ने मौक़े पर ही खातिरदारी की है। अभी और भी ख़ातिरदारी होनी है।
यह कांग्रेस शासित राजस्थान हैं यहाँ असामाजिक तत्व बिल्कुल भी बर्दाश्त नहीं किये जायेगे।#Udaipur pic.twitter.com/kBflQ0qzdB
— Nitin Agarwal (@nitinagarwalINC) June 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

