న్యూఢిల్లీ: ఆధునిక హంగులతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్రపతికి పార్లమెంట్‌ను ప్రారంభించే అవకాశం ఇవ్వలేదని ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. కేంద్ర సర్కారు అవేవీ పట్టించుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు చేసింది.
ఈ నెల 28న (ఆదివారం) ప్రధాని నూతన పార్లమెంట్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అయ్యింది. ఆ వీడియోలో పార్లమెంట్ లోపలి, బయటి దృశ్యాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ.. ఆ రెండు సభల్లో సీటింగ్ అమరికకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
#WATCH | Delhi: First look at the New Parliament building that will be inaugurated by Prime Minister Narendra Modi on May 28.#NewParliamentBuilding pic.twitter.com/ouZoz6dLgu
— ANI (@ANI) May 26, 2023