Tulip garden | తెరచుకున్న తులిప్ గార్డెన్.. కశ్మీర్ పర్యాటకులకు కనువిందు.. Video
Tulip garden | జమ్ముకశ్మీర్‌లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్‌ను పుష్పవర్ధన విభాగం అధికారులు తెరిచారు. ఏటా పుష్పాలు వికసించే సీజన్లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గార్డెన్‌ను తెరుస్తుంటారు.
Tulip garden : జమ్ముకశ్మీర్‌లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్‌ను పుష్పవర్ధన విభాగం అధికారులు తెరిచారు. ఏటా పుష్పాలు వికసించే సీజన్లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గార్డెన్‌ను తెరుస్తుంటారు. ఈ పూదోటలో ఐదు రంగుల్లో తులిప్ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్ పూలతోపాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 55 హెక్టార్లు ఉంది. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తున్నప్పుడు ఈ గార్డెన్‌ను తెరుస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది తులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు.
గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులిప్ ఫెస్టివల్ జరిగింది. ఈ ఏడాది కూడా ఏప్రిల్‌లో తులిప్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఫెస్టివల్ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కాగా తులిప్ గార్డెన్‌లోని రంగురంగుల తులిప్ పుష్పాలు, రకరకాల ఇతర పుష్పాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. తులిప్ గార్డెన్‌లోని పుష్పాల అందాలను కింది వీడియోలో వీక్షించండి..
VIDEO | Asia’s largest tulip garden in #Srinagar, Jammu and Kashmir, opens for public.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/KBwSQ4xMfc
— Press Trust of India (@PTI_News) March 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

