నోయిడా: నోయిడా నివాసి వార్దా ఖాన్(Wardah Khan)..తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదలివేసి సివిల్స్ పరీక్షలకు ప్రిపేరైంది. ఆమెకు తాజా ఫలితాల్లో 18వ ర్యాంక్‌ను సాధించింది. 24 ఏళ్ల ఆ యువతి తన తొలి ప్రిఫరెన్స్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్‌ను ఎంపిక చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని ఉన్నత స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక విద్యార్థి తరహాలోనే తన జర్నీ స్టార్ట్ అయ్యిందని, సివిల్స్ ర్యాంక్ కొట్టాలన్న తపన ఉండేదని, కానీ 20 లోపే ర్యాంక్ వస్తుందన్న అనుకోలేదని ఆమె అన్నారు. తన కల నెరవేరినట్లు ఫీలవుతున్నానని అన్నారు. తన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారని, చాలా గర్వంగా ఫీలవుతున్నారని ఖాన్ తెలిపారు.
నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్‌లో వార్దా ఖాన్ ఇళ్లు ఉన్నది. ఢిల్లీ వర్సిటీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ చదువుకున్నది. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. ప్రస్తుతం ఆమె తల్లి వద్దే ఉంటోంది. కాలేజీ చదువుకునే రోజుల్లో.. జియోపాలిటిక్స్ అంటే తనకు ఇష్టమని, హిస్టరీ, పాలిటీ సబ్జెక్టులకు ఇష్టమైనవని ఆమె అన్నారు. కాలేజీ రోజుల్లో ఎక్కువ శాతం డిబేట్స్‌లో పాల్గొనేది. కానీ ఆ సమయంలోనూ సివిల్ సర్వీస్‌లో చేరాలన్న ఆలోచన లేదన్నారు.
అయితే ఉద్యోగం చేస్తున్న సమయంలో తనకు సివిల్ సర్వెంట్ కావాలన్న కాంక్ష కలిగిందన్నారు. కార్పొరేట్ సంస్థకు 8 నెలల పాటు పనిచేశాను, అది నన్ను తృప్తిపరచలేదని, సమాజానికి ఏదో చేయాలని భావించానని, దేశానికి పనిచేయాలని అనుకున్నానని, ప్రజల జీవితాలను మార్చాలని భావించినట్లు వార్దాఖాన్ తెలిపారు. సివిల్స్ సిలబర్, అవకాశాలు తన కెరీర్‌కు కావాల్సినట్లు ఉందని గ్రహించానని, అందుకే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలివేసి సివిల్స్ ప్రిపరేషన్‌పై టార్గెట్ పెట్టినట్లు చెప్పారు.
ఇంటి వద్దే ప్రిపేరయ్యానని, ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఏడాది పాటు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఎన్సీఈఆర్టీ, లక్ష్మీకాంత్ రాసిన పాలిటీ లాంటి బేసిక్స్‌ను కచ్చితంగా ఫాలోకావాలని ఆమె సలహా ఇచ్చారు. ఈ బుక్స్ చాలా బేసిక్ అని, వీటిని కచ్చితంగా చదవాలన్నారు. 2023 యూపీఎస్సీలో ఆదిత్య శ్రీవాత్సవ్ టాప్ రాగా, పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి మూడవ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే.
#WATCH | Uttar Pradesh | Noida resident Wardah Khan secures 18th rank in UPSC 2023.
She says, “I had never thought that I would make it to Top 20. I just wanted to make it to the list (of qualifiers). This is a huge moment for my family and me. This was my second attempt. I have… pic.twitter.com/2KoPdlDPmV
— ANI (@ANI) April 16, 2024