ఈసీ ఉక్కిరి బిక్కిరి
మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీఐ) తీవ్ర రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నది. ఓటర్ల రికార్డుల నిర్వహణ, ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాల సమీక్ష(సర్) ప్రక్రియపై ఈ పరిణామాలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
- కర్ణాటక, యూపీ, ఎంపీలో ఓటర్ జాబితాలపై కొత్త వివాదాలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీఐ) తీవ్ర రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నది. ఓటర్ల రికార్డుల నిర్వహణ, ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాల సమీక్ష(సర్) ప్రక్రియపై ఈ పరిణామాలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మండ్లేశ్వర్ వద్ద నర్మదా నదీ తీరంలో ఇండోర్‌కు చెందిన చిరునామాలు కలిగిన 343 ఓటరు గుర్తింపు కార్డులు లభించడం, ఉత్తర ప్రదేశ్‌లో ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 దరఖాస్తుల ఆడిట్, అలాగే కర్ణాటకలో 2.28 లక్షలకు పైగా ఫామ్ 7 దరఖాస్తులు అందడం వంటి పరిణామాలు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలకు కొత్త ఆయుధాలను అందించాయి.
నదీ తీరంలో ఓటర్ కార్డులు
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నదీ తీర శుభ్రత కార్యక్రమంలో మండలేశ్వర్ ఘాట్ వద్ద 343 ఓటర్ గుర్తింపు కార్డులు లభ్యం కావడంతో వివాదం చెలరేగింది. ఈ ఓటర్ కార్డులు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదీ తీరానికి ఎలా చేరాయనే దానిపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
యూపీలో ఆడిట్‌కు ఆదేశం
ఉత్తరప్రదేశ్‌లో సర్ ప్రక్రియ ముగిసిన ఏప్రిల్ 10 నుంచి కంప్యూటర్ సహాయకుల ద్వారా నమోదు చేసిన ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 దరఖాస్తులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఎన్నికల సంఘం యంత్రాంగం ఆదేశించింది. పిలిభిత్, ఆజంగఢ్‌లో అక్రమాలు జరిగినట్టు నివేదికలు వచ్చిన నేపథ్యంలో యూపీ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా ఈ ఆడిట్‌కు ఆదేశాలు జారీచేశారు. అక్రమాలు జరిగినట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్ణాటకలో లక్షల్లో ఫామ్ -7 దరఖాస్తులు
ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివాదంలో కర్ణాటక మరో కీలక కేంద్రంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారం జూన్ 16 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో రాష్ట్రంలో ఎన్నికల సంఘానికి ఫామ్ 7 దరఖాస్తులు 2,28,917 అందాయి. ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరును చేర్చడాన్ని వ్యతిరేకించడానికి లేదా ఇప్పటికే ఉన్న జాబితా నుంచి ఒక పేరును తొలగించమని కోరడానికి ఫామ్ 7ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియలో గంపగుత్తగా దరఖాస్తులు సమర్పిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దరఖాస్తుల పరిమాణం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

