Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ కొంపముంచిన ఓకే..!
‘ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు అక్షరాలా మూడు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. విశాఖపట్టణానికి చెందిన రైల్వే స్టేషన్ మాస్టర్ అక్టోబర్ 12, 2011న చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన మహిళను వివాహం చేసుకున్నారు.
Station Master | విశాఖపట్టణం: ‘ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు అక్షరాలా మూడు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. విశాఖపట్టణానికి చెందిన రైల్వే స్టేషన్ మాస్టర్ అక్టోబర్ 12, 2011న చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. ఒకరోజు స్టేషన్ మాస్టర్ విధుల్లో ఉండగా ఫోన్ చేసిన భార్య వాగ్వివాదానికి దిగింది. దీంతో అతడు.. ‘ఓకే, మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం’ అని ఫోన్ పెట్టేశాడు. సరిగ్గా ఇదే అతడి కొంప ముంచింది.
అదే సమయంలో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను పట్టుకుని ఉన్న మరో స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్‌కు ‘ఓకే’ అన్న పదం వినిపించడంతో ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. గూడ్స్ రైలు డిస్పాచ్‌కు ఆయన ‘ఓకే’ చెప్పారనుకుని భావించి రైలుకు సిగ్నల్ ఇచ్చారు. ఆ రైలు మావోయిస్టు ప్రభావిత నిషిద్ధ ప్రాంతం గుండా బయలుదేరింది. రాత్రి పరిమితులను ఉల్లంఘించి అనధికారిక మార్గంలో రైలు ప్రయాణించినందుకు గాను రైల్వే రూ. 3 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా స్టేషన్ మాస్టర్ సస్పెండయ్యారు. దీనంతటికీ భార్యే కారణమని భావించిన స్టేషన్ మాస్టర్ భార్య నుంచి విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు.
మరోవైపు, భర్త, అతని కుటుంబ సభ్యులు తనను హింసిస్తున్నారంటూ ఆయన భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసును దుర్గ్ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. అక్కడ విడాకుల పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో స్టేషన్ మాస్టర్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తాజాగా హైకోర్టులో స్టేషన్ మాస్టర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
వివాహమైన తర్వాత కూడా ఆమె తన మాజీ లవర్‌తో సంబంధం కొనసాగిస్తున్నదని, అందులో భాగంగానే భర్త, కుటుంబ సభ్యులపై అదనపు కట్నం, హింస ఆరోపణలు చేస్తున్నదని గుర్తించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. భార్య ప్రవర్తన క్రూరంగా ఉందని, ఆమె చర్యలు భర్తను మానసిక క్షోభకు గురిచేశాయని, రైలు ఘటనకు భార్యే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

