కన్యత్వ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధం: ఢిల్లీ హైకోర్టు
Virginity test | కస్టడీలో ఉన్న మహిళలకు కన్యత్వ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో అయినా, పోలీస్ కస్టడీలో అయినా ఇలాంటి ఘటనలు అమానవీయమని, మహిళల గౌరవానికి భంగకరమని వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: కస్టడీలో ఉన్న మహిళలకు కన్యత్వ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో అయినా, పోలీస్ కస్టడీలో అయినా ఇలాంటి ఘటనలు అమానవీయమని, మహిళల గౌరవానికి భంగకరమని వ్యాఖ్యానించింది. కన్యత్వ పరీక్షలు నిర్వహించడానికి చట్టపరంగా ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ మంగళవారం తీర్పు వెలువరించారు.
కేరళలో 1992 మార్చి 27న సిస్టర్ అభయ అనే మహిళ మరణించింది. బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో 2020లో సిస్టిర్ సెఫీని కేసులో దోషిగా నిర్ధారించింది. కోర్టులో నేరాన్ని రుజువు చేయడం కోసం 2008 నవంబర్ 25న సెఫీకి కన్యత్వ పరీక్షలు చేయించింది.
అయితే, సీబీఐ తనకు కన్యత్వ పరీక్షలు చేయించడాన్ని సవాల్ చూస్తే ఇటీవల సిస్టర్ సెఫీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పును వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

