న్యూఢిల్లీ : సింహాలతో ఓ చిన్నారి చెలగాటమాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో బాలుడు లయన్స్‌తో ఆడుకోవడం కనిపించింది. సింహాలతో క్లోజ్‌గా మూవైన బాలుడు ఓ దశలో తన ముఖాన్ని సింహానికి దగ్గరగా తీసుకువెళ్లాడు.
ఓ దశలో బాలుడు సింహం నోటిలోకి తన చేయి దూర్చగా అది కరిచేందుకు ప్రయత్నించింది. సింహాన్ని కొట్టేందుకు బాలుడు ప్రయత్నించడం కనిపించింది. బాలుడు ఎలాంటి బెరుకు లేకుండా సింహాలతో ఆడుకోవడం ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.4 లక్షల మంది వీక్షించారు.
సింహాలకు అతి సమీపంగా బాలుడు మెలగడం పట్ల పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారిని సింహాలకు సన్నిహితంగా మెలగడాన్ని తల్లితండ్రులు ఎలా అనుమతించారని మరికొందరు యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన ఫీట్ అని పలువురు యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.