న్యూఢిల్లీ : విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ తరహా ఫుడ్ ట్రెండ్‌తో కూడిన వీడియో (Viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బనానా పిజ్జా ఎలా తయారుచేయాలనే వీడియోపై నెటిజన్లు తలో రకంగా స్పందించారు. మగ్గిన అరటి పండ్లతో కొందరు పిజ్జా తయారు చేస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఈ వీడియో పండిన అరటిపండ్లను గుజ్జు చేయడంతో ప్రారంభం కాగా, దీనిపై సాస్ వేసి ఆపై మోజారెల్లా చీజ్‌ను యాడ్ చేయడం ఈ వైరల్ క్లిప్‌లో చూడొచ్చు. ఈ వెరైటీ కాంబినేషన్‌పై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇది చాలా పెయిన్ఫుల్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా బనానా పిజ్జాను మీరు ఇలా చేస్తారని అనుకోలేదని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More