న్యూఢిల్లీ : లతా మంగేష్కర్ ఆలపించిన మేరా దిల్ యే పుకారే సాంగ్ రీమిక్స్ వెర్షన్‌కు పాక్ బాలిక ఆయేషా ఫెర్ఫామెన్స్ వైరల్ అయినప్పటి నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు తమదైన శైలిలో సాంగ్ రీమిక్స్ వెర్షన్ల వీడియోలను షేర్ చేస్తున్నారు.
ఈ పాటకు ఆయేషా వైరల్ డ్యాన్స్ వీడియోతో ఆమె రాత్రికి రాత్రి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారారు. తాజాగా ఈ పాటను ఓ చిన్నారి ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఈ పాటను చిన్నారి బాలిక ముద్దుముద్దుగా పాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మేరా దిల్ యే పుకారే సాంగ్‌ను మనీహ పాడిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 20 లక్షల మంది పైగా వీక్షించారు. ఈ వీడియోలో మనీహ అద్దంలో చూస్తూ పాటను క్యూట్‌గా ఆలపించింది. లిరిక్స్ కొంచెం అటుఇటూగా ఉన్నా చిన్నారి పెర్ఫామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మేరా దిల్ యూ పుకారే ఆజా మనీహ వెర్షన్ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.