మధ్య వేలు చూపాడని బైకర్‌ను చితకబాదిన బస్సు డ్రైవర్.. వీడియో
Bengaluru | కర్ణాటకలోని బెంగళూరులో ఓ బైకర్పై ఆర్టీసీ బస్సు డ్రైవర్ విచక్షణారహితంగా దాడిచేశాడు. ఐటీ సిటీ పరిధిలోని యెలహంకలో బెంగళూరు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కు చెందిన రెండు బస్సులు
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో ఓ బైకర్పై ఆర్టీసీ బస్సు డ్రైవర్ విచక్షణారహితంగా దాడిచేశాడు. ఐటీ సిటీ పరిధిలోని యెలహంకలో బెంగళూరు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC)కు చెందిన రెండు బస్సులు వెళ్తున్నాయి. ఒక బస్సును మరో బస్సు ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా ఓ బైక్ వచ్చింది. బైక్‌ను గమిణించినప్పటికీ బస్సు డ్రైవర్లు ఎవ్వరు తమ వాహనాల స్పీడ్‌ను తగ్గించుకోలేదు. దీంతో బైక్‌పై వెళ్తున్న సందీప్ అనే వ్యక్తి బస్సు డ్రైవర్‌కు మధ్యవేలు చూపించాడు. దీంతో బస్సును ఆపిన డ్రైవర్.. సందీప్‌పై దాడి చేశాడు. అతని బైక్ తాళం, ఫోను లాక్కుని వచ్చేశాడు.
దీంతో వాటికోసం సందీప్ కూడా బస్సులో ఎక్కడంతో బస్సు డ్రైవర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. మరోసారి అతనిపై పిడిగుద్దులు గుప్పించాడు. విచక్షణా రహితంగా కొట్టడంతో బైక్ రైడర్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. డ్రైవర్ శాంతించలేదు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ప్రయాణికులు కొందరు తమ సెల్ఫోన్లలో బంధించి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నది.
విషయం తెలుసుకున్న బీఎంటీసీ అధికారులు ఆ బస్సు డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Road Rage in #Bengaluru: A #biker was #assaulted by a #BMTC #bus driver for being in the way while overtaking another bus in #Yelahanka.
The driver, who alleged he was shown the middle-finger by the biker, has been suspended. @NammaBengaluroo @WFRising pic.twitter.com/9lLVFhPvZK
— Rakesh Prakash (@rakeshprakash1) November 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- BMTC
- Bus driver
- Yelahanka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

