రైతులపైకి దూసుకెళ్లిన మంత్రుల కాన్వాయ్.. యూపీలో చెలరేగిన హింస

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 8 మంది గాయపడినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆదివారం రోడ్డు పక్కన నిరసన తెలిపారు. కాగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని వాహనాలు కొందరు రైతులను ఢీకొన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా 8 మందికి గాయాలయ్యాయని ట్విట్టర్లో పేర్కొంది. అయితే దీని గురించి యూపీ ప్రభుత్వం ప్రకటించలేదు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో లఖింపూర్ ఖేరిలో హింస చెలరేగింది. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి గాయపడినట్లు తెలుస్తున్నది. కాగా, పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

