చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజారిటీ లేదు. దీంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో జాప్యం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి భద్రతా ప్రోటోకాల్‌ను పోలీసులు ఉపసంహరించారు. (Vijay’s Security Protocol) ఈ పరిణామం వల్ల పూర్తి భద్రతా కాన్వాయ్ లేకుండానే విజయ్ తన కారులో ప్రయాణిస్తున్నారు.
కాగా, సాధారణంగా కాబోయే ముఖ్యమంత్రికి లేదా కొత్తగా బాధ్యతలు స్వీకరించబోయే ముఖ్యమంత్రి రాకపోకల కోసం పూర్తి భద్రతా ప్రోటోకాల్‌తో కాన్వాయ్ ఏర్పాటు చేస్తారని పోలీస్ అధికారి తెలిపారు. అయితే ప్రమాణ స్వీకారంలో జాప్యం కారణంగా పూర్తి ప్రోటోకాల్ కాన్వాయ్ వద్దని విజయ్ చెప్పారని అన్నారు. ఆయన అభ్యర్థన మేరకే పూర్తి ప్రోటోకాల్ కాన్వాయ్‌ను ఉపసంహరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే ప్రాథమిక పైలట్ భద్రత కొనసాగుతుందని వివరించారు.
Breaking news— The game has begun in Tamilnadu politics 🔥🔥
Vijay , chief of TVK has left his residence and may meet the governor shortly.
Vijay will be the next chief minister of Tamilnadu. pic.twitter.com/KumOzsTsPO
— I.N.D.I.A गठबन्धन (@savedemocracyI) May 7, 2026