రేపు విజయ్ ప్రమాణం?.. తమిళనాట మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిన టీవీకే
తమిళనాడులో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్‌కు చెందిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది.
- కాంగ్రెస్, వామపక్షాలు సహా పలు పార్టీలతో మద్దతుపై చర్చలు
చెన్నై, మే 5: తమిళనాడులో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్‌కు చెందిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే ఆయనకు మద్దతు ఇవ్వడానికి పలు పార్టీలు ముందుకు వస్తుండటంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుతో విజయ్ ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని, ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
చెన్నైలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ మంగళవారం సమావేశమయ్యారు. అధికార ఏర్పాటుకు ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కాంగ్రెస్ సహా పలు చిన్న పార్టీలు ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆ పార్టీ వర్గాలు వెల్లడించిన ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాలతో పాటు వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వంటి చిన్న పార్టీలతో విజయ్ మంతనాలు జరిపినట్టు సమాచారం. వీరి మద్దతు లభిస్తే విజయ్ సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.
రెండు వారాల గడువివ్వండి
అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు మెయిల్ చేశారు. కాగా, విజయ్ను ఆహ్వానించడంపై గవర్నర్ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోయినా బలపరీక్షలో ఆయనను ఓడించే సాహసాన్ని డీఎంకే, ఏఐఏడీఎంకే చేయవని, బహుశా వారు ఓటింగ్‌కు గైర్హాజరయ్యే వ్యూహాన్ని అనుసరించవచ్చునని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సుమంత్ రామన్ వ్యాఖ్యానించారు.
విజయ్ బల నిరూపణ ఎలా?
ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీ 108 సీట్లను గెల్చుకుంది. అందులో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేసినందున ఒక సీటును వదులుకోవాలి. అలాగే విజయ్ పార్టీ నుంచే స్పీకర్ ఎన్నికవుతారు కాబట్టి ఆయన కూడా ఓటింగ్‌లో పాల్గొనరు. ఇలా జరిగితే అప్పుడు విజయ్ పార్టీ బలం 106కు తగ్గుతుంది. వాస్తవానికి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరమవుతాయి. అంటే ఇంకా 12 సీట్లు కావాలి. ప్రస్తుతమైతే డీఎంకే, ఏఐడీఎంకే కూటముల నుంచి కొన్ని పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ ఐదు, రెండు కమ్యూనిస్టు పార్టీలు చెరో రెండు సీట్లతో నాలుగు, డీఎండీకే ఒక సీటుతో ఉన్నాయి.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు రెండు, వీసీకేకు రెండు సీట్లు ఉన్నాయి. ఇక ఏఐఏడీఎంకే కూటమి నుంచి పీఎంకేకు నాలుగు సీట్లు, బీజేపీకి ఒకటి, ఏఎంఎంకేకు ఒకటి ఉన్నాయి. రెండు కూటముల నుంచి ఈ పార్టీలు విజయ్‌కు మద్దతు తెలిపితే ఆ పార్టీకి అదనంగా 21 సీట్లు లభిస్తాయి. అంటే విజయ్‌కు మద్దతుగా నిలిచే సంఖ్య 129కు చేరుకుంటుంది. అయితే వాస్తవానికి విజయ్‌కు ఇన్ని పార్టీల మద్దతు అవసరం లేదు. కేవలం 12 సీట్లు మాత్రమే అవసరమవుతాయి.
అలాగని కేవలం 12 సీట్లకు అవసరమైన మద్దతే తీసుకుంటే భవిష్యత్తులో ఏదైనా బలనిరూపణ జరపాల్సి వచ్చినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. కాగా, విజయ్ బుధవారం గవర్నర్‌కు కలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన విజయ్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉంచే అవకాశం ఉంది. ఒకటి సభలో బలాన్ని నిరూపించుకోమని కోరవచ్చు. రెండు విజయ్‌కు మద్దతు తెలిపే పార్టీల నుంచి అనుమతి పత్రాలు తెమ్మని ఆదేశించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

