యోగిపై పోటీ చేస్తానన్న మాజీ ఐపీఎస్.. గంటల్లోనే అరెస్ట్
Amitab Thakur | ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై అమితాబ్ ఠాకూర్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ ఎంపీ

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై అమితాబ్ ఠాకూర్‌ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ తనపై అత్యాచారం చేశాడంటూ.. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈ నెల 16న 24 ఏండ్ల యువతి తన స్నేహితుడితో కలిసి సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ.. ఎంపీ అతుల్ రాయ్‌కు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. 24వ తేదీన ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అయితే ఈ కేసులోనే అమితాబ్ ఠాకూర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అమితాబ్ ఠాకూర్ తన విధుల పట్ల నిబద్ధతతో పని చేయడం లేదని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనను తొలగించింది. అనంతరం తాను 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యోగిపై పోటీ చేస్తానని, త్వరలోనే పార్టీని ప్రారంభించబోతున్నట్లు అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్టు యూపీలో సంచలనంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

