న్యూఢిల్లీ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ మూవీ పుష్పలోని సామి సామి సాంగ్‌కు స్కూల్ విద్యార్ధినుల ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ వీడియో (Viral Video) నెట్టింట వైరలవుతోంది. సబితా చంద్ర అనే యూజర్ ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 34,000 మందికిపైగా వీక్షించారు.
Happy Saturday! Sending you good vibes. Spread joy 👌✨ pic.twitter.com/oEXF03otLm
— Sabita Chanda (@itsmesabita) March 4, 2023
19 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో యూనిఫాం ధరించిన స్కూల్ విద్యార్ధిని సామి సామి సాంగ్‌కు క్రేజీ స్టెప్స్‌తో డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వగా ఆమె క్లాస్మేట్స్ సైతం డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఎంతో ఉత్సాహంగా గర్ల్స్ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.
సో క్యూట్ అని ఓ యూజర్ ప్రశంసించగా, వాట్ ఏ రాక్‌స్టార్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. 2021లో విడుదలైన పుష్ప మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందనపై ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను చిత్రీకరించారు.
Read More :