Watch: అతిపెద్ద కరెన్సీ నోట్ల దండను మెడలో ధరించిన వరుడు.. వీడియో వైరల్
Groom's Garland Of Currency Notes | కరెన్సీ నోట్లతో తయారు చేసిన అతి పెద్ద దండను ఒక వరుడు మెడలో ధరించాడు. (Groom's Garland Of Currency Notes ) మేడ మీద గోడపై అతడు నిల్చొని ఉండగా, మెడలో ఉన్న కరెన్సీ నోట్ల దండ పైనుంచి కింద వరకు పరిచి ఉంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: కరెన్సీ నోట్లతో తయారు చేసిన అతి పెద్ద దండను ఒక వరుడు మెడలో ధరించాడు. (Groom’s Garland Of Currency Notes ) మేడ మీద గోడపై అతడు నిల్చొని ఉండగా, మెడలో ఉన్న కరెన్సీ నోట్ల దండ పైనుంచి కింద వరకు పరిచి ఉంది. సుమారు రూ.20 లక్షల విలువైన రూ.500 నోట్లను ఈ కరెన్సీ దండ తయారీలో వినియోగించినట్లు తెలుస్తున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. ఖురేషిపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మేడ మీద గోడపై నిల్చొన్న అతడు కింద వరకు వేలాడిన అతి పెద్ద డబ్బుల నోట్ల దండను మెడలో ధరించాడు. ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
కాగా, ఎంతో ప్రత్యేకంగా ఉండటంతోపాటు అందరినీ ఆకట్టుకున్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పేద ఇంటి మాదిరిగా ఉన్న మేడపై నుంచి కరెన్సీ నోట్ల దండతో ఫోజు ఇచ్చిన ఆ వరుడి రిచ్‌నెస్ చూసి కొందరు షాక్ అయ్యారు. కరెన్సీ నోట్లను ఇలా ప్రదర్శించడం అవసరమా అని మరికొందరు ప్రశ్నించారు. ఆ దండలోని నోట్లు నకిలీ కావచ్చని ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. దీని గురించి ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాలని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే ఇంత పెద్ద కరెన్సీ దండ వేసుకుని ఆ వరుడు ఎలా నడుస్తాడు అని ఒకరు చమత్కరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

