వీడియో: వంతెనపై ప్రవాహాన్ని దాటబోయి నదిలో కొట్టుకుపోయిన యువకుడు
Man washed away: వంతెనపై ఉధృతంగా ఉన్న ప్రవాహాన్ని దాటబోయి ఓ యువకుడు నదిలో కొట్టుకుపోయాడు. యువకుడు నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను
డెహ్రాడూన్: వంతెనపై ఉధృతంగా ఉన్న ప్రవాహాన్ని దాటబోయి ఓ యువకుడు నదిలో కొట్టుకుపోయాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫతేపూర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడు నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను ఓ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దానికి ‘యంగ్ మ్యాన్ వాష్డ్ అవే డ్యూ టు ఎ స్ట్రాంగ్ కరెంట్ ఇన్ ఎ రెయినీ డ్రెయిన్ ఇన్ ద ఫతేపూర్ ఏరియా’ అనే క్యాప్షన్‌ను జోడించింది.
ఈ భయానక వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్లిప్పింగ్‌లో నది ఉప్పొంగి వంతెన పైనుంచి ప్రవహిస్తున్నది. వంతెన ఆవలివైపు ఓ యువకుడు బైకుపై కూర్చుని ఉండగా, మరో యువకుడు నడుచుకుంటూ నదిని దాటే ప్రయత్నం చేశాడు. కొన్ని అడుగులు వేయగానే ప్రవాహాన్ని తట్టుకోలేక నీళ్లలో జారిపడ్డాడు. వంతెన పైనుంచి నదిలోపడి కొట్టుకుపోయాడు.
ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడి జాడ ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. గల్లంతైన యువకుడు ఎవరు అనేది కూడా ఇప్పటివరకు గుర్తించలేదని చెప్పారు.
#WATCH | Uttarakhand: A young man washed away due to a strong current in a rainy drain in the Fatehpur area. The person is missing & search operation is underway, but so far nothing has been found: SDM Haldwani Manish Kumar Singh
(Source: viral video) pic.twitter.com/QzEzsXqjXf
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

