మూడుసార్లు ఫెయిలైనా వెనక్కి తగ్గలేదు : సివిల్ జడ్జిగా ఎంపికైన కూరగాయల విక్రేత కూతురు!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూరగాయలు అమ్ముతూ పొట్టపోసుకునే వ్యక్తి కూతురు సివిల్ జడ్జిగా ఎంపికై అందరి మన్ననలూ అందుకుంది.
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూరగాయలు అమ్ముతూ పొట్టపోసుకునే వ్యక్తి కూతురు సివిల్ జడ్జిగా ఎంపికై అందరి మన్ననలూ అందుకుంది. మూడుసార్లు రిక్రూట్మెంట్ పరీక్షలో ప్రతికూల ఫలితం ఎదురైనా నాలుగోసారి పట్టుపట్టి పరీక్షను క్లియర్ చేసి న్యాయమూర్తిగా ఎంపికైంది 29 ఏండ్ల అంకితా నాగర్. మూడుసార్లు పరీక్షలో ఫెయిలైనా జడ్జి కావాలనే తన లక్ష్యం నుంచి దూరం కాలేదని అంకిత చెప్పుకొచ్చింది.
నాలుగో ప్రయత్నంలో తాను సివిల్ జడ్జి క్లాస్-11 పరీక్షను పూర్తిచేశానని ఆమె తెలిపింది. జడ్జిగా ఎంపికైన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని వెల్లడించింది. అంకిత తండ్రి అశోక్ నాగర్ ఇండోర్‌లోని ముసఖేది ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తుంటారు. పరీక్షల కోసం ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత తాను తండ్రి పనుల్లో సాయం చేస్తానని అంకిత చెబుతోంది. న్యాయ విద్యలో డిగ్రీ చేసిన తర్వాత తనకు జడ్జి కావాలని అనుకున్నానని మాస్టర్స్ డిగ్రీ సైతం పూర్తిచేశానని చెప్పింది.
మూడు సార్లు లక్ష్య సాధనలో విఫలమైనా విడిచిపెట్టకుండా తన కల నెరవేర్చుకున్నానని తెలిపింది. సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కోర్టుకు వచ్చిన ప్రతిఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా తమ కూతురు ధైర్యం కోల్పోకుండా నిలిచిన తీరు ప్రతి యువతికీ ఉదాహరణగా నిలుస్తుందని అంకిత తండ్రి అశోక్ నాగర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

