అంబానీ కేసును పక్కదోవ పట్టించేందుకే ఆ ఆరోపణలు : శరద్ పవార్

ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరం బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఇవాళ ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖేశ్ అంబానీ సెక్యూర్టీ విచారణ అంశాన్ని తప్పుదోవ పట్టిచేందుకు హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేసినట్లు పవార్ అన్నారు. అంబానీ బాంబు బెదిరింపు కేసుతో సంబంధం ఉన్న మన్సూక్ హిరేన్ ను ఎవరు హత్య చేశారో కూడా విచారణలో తేలుతుందని ఆయన తెలిపారు. ముంబై ఏటీఎస్ ఈ కేసును సరైన రీతిలోనే విచారిస్తోందని, దాన్ని పక్కదోవ పట్టించేందుకు, పరం బీర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని శరద్ పవార్ తెలిపారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసేది లేదని పవార్ స్పష్టం చేశారు.
ఇన్స్పెక్టర్ సచిన్ వాజేను మంత్రి దేశ్‌ముఖ్ కలవలేదని, ఎందుకంటే ఆ సమయంలో ఆయన కరోనా చికిత్స పొందారని శరద్ పవార్ తెలిపారు. పబ్బులు, రెస్టారెంట్ల నుంచి నెలకు వంద కోట్లు వసూల్ చేయాలని దేశ్‌ముఖ్ పోలీసులకు ఆదేశించినట్లు పరం బీర్ తన లేఖలో ఆరోపించారు. అయితే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మంత్రి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో ఉన్నారని, నాగపూర్‌లోని తన ఇంట్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన చెప్పారు. అందుకే ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పవార్ తెలిపారు. అంబానీ బాంబు బెదిరింపు కేసు విచారణ సరిగా సాగడం లేదని మాజీ పోలీసు కమీషనర్ పరం బీర్ సింగ్‌ను హోమ్గార్డ్స్ డీజీగా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ పోలీసు కమీషనర్.. మంత్రి దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. సీఎం ఉద్దవ్‌కు పరం బీర్ లేఖ రాశారు. హోంమంత్రి వసూళ్ల రాకెట్ మొదలుపెట్టిన ఆ లేఖలో పోలీసు ఆఫీసర్ ఆరోపించారు. సచిన్ వాజే కూడా ఆ జాబితాలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

