ఉత్తరాఖండ్ హిమపాతం | 26 మంది మృతదేహాలు వెలికితీత
Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో గత మంగళవారం హిమపాతం సంభవించి మంచు దిబ్బల కింద చిక్కుకున్న పర్వతారోహకుల కోసం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో గత మంగళవారం హిమపాతం సంభవించి మంచు దిబ్బల కింద చిక్కుకున్న పర్వతారోహకుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. నాలుగు రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో మొత్తం 26 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ముగ్గురి మృతదేహాల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతన్నది.
కశ్మీర్‌లోని ఓ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న 29 మంది ట్రెయినీ పర్వతారోహకులు గత మంగళవారం ఉత్తరకాశీలోని ఓ పర్వతం బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అనంతరం పర్వతాన్ని అధిరోహించడం మొదలుపెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా హిమపాతం సంభవించింది.
దాంతో పర్వతారోహకులంతా ఆ మంచు దిబ్బల కింద గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ తదితర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
కాగా, గత మంగళవారం నుంచి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా అదేరోజు నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం ఒక్కబాడీ కూడా లభించలేదు. గురువారం 15 మృతదేహాలను, శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు మరో 7 మృతదేహాలను వెలికితీశారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 26కు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

