ఉత్తరాఖండ్ అసెంబ్లీ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధర్నా

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హరీష్ ధామి, మనోజ్ రావత్ ఆ రాష్ట్ర అసెంబ్లీ వద్ద మంగళవారం ధర్నా చేశారు. ధార్చులలో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని, చార్ ధామ్ యాత్రను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన సీఎం పుష్కర్ సింగ్ ధామి వారి విన్నపాలను స్వీకరించారు.
మరోవైపు చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా అర్చకులు నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనిపై స్పందించారు. అర్చకుల హక్కులను దేవస్థానం బోర్డు హరించకుండా చూస్తామన్నారు.
అందరి అభిప్రాయాలను ప్రభుత్వం వింటుందని, సమస్యలను పరిష్కరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని, చర్యల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని అన్నారు. అన్ని సందేహాలు తీరుస్తామని, అవసరమైతే ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం బోర్డు చట్టానికి సవరణలు చేస్తామని తనని కలిసిన అర్చక ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

