Watch: పోలీస్‌ను పట్టుకుని కొట్టిన లాయర్లు.. వీడియో వైరల్
Lawyers Beat Up Police | లాయర్లు ఒక పోలీస్‌పై దాడి చేశారు. ఆయనను పట్టుకుని కొట్టారు. (Lawyers Beat Up Police) దీంతో న్యాయవాదుల నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీస్ అధికారి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: లాయర్లు ఒక పోలీస్‌పై దాడి చేశారు. ఆయనను పట్టుకుని కొట్టారు. (Lawyers Beat Up Police) దీంతో న్యాయవాదుల నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీస్ అధికారి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సబ్ కలెక్టరేట్ పోలీస్ పోస్ట్ ఇన్ఛార్జ్ దుర్గేష్ సింగ్ కొందరు న్యాయవాదులతో ఘర్షణకు దిగాడు. దీంతో లాయర్లు ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి బుధవారం వెళ్లారు. అక్కడ పోలీస్ అధికారి దుర్గేష్ సింగ్‌ను న్యాయవాదులు చూశారు. దీంతో ఆగ్రహించిన కొందరు లాయర్లు ఆ పోలీస్ అధికారి వెంటపడ్డారు. దుర్గేష్ సింగ్‌ను పట్టుకుని కొట్టారు. ఈ నేపథ్యంలో లాయర్ల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీస్ అధికారి పరుగులు తీశారు.
కాగా, పోలీస్ అధికారి దుర్గేష్ సింగ్‌ను లాయర్లు కొడుతున్న సంఘటనను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీస్‌ను చట్టాన్ని పరిరక్షించాల్సిన న్యాయవాదులు కొట్టడాన్ని కొందరు విమర్శించారు. యూపీలో శాంతిభద్రతల పరిస్థితిని ఈ వీడియో కళ్లకు కడుతున్నదని మరికొందరు మండిపడ్డారు.
वीडियो महाराजगंज जिले का है। जिसे मारा जा रहा वह यूपी पुलिस के दरोगा हैं। पीटने वाले कानून के रक्षक कहे जाने वाले वकील।
बाकी यूपी में सब बढ़िया है। pic.twitter.com/9O34tjeRZm
— Rajesh Sahu (@askrajeshsahu) January 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

