ఎన్నికల వేళ యువతపై యూపీ సీఎం హామీల జల్లు..!
Yogi Adityanath: వచ్చే ఏడాది ప్రథమార్థంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి యువతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని కోటి మంది యువతకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు అందించనున్నట్టు

లక్నో: వచ్చే ఏడాది ప్రథమార్థంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి యువతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని కోటి మంది యువతకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు అందించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర యువత డిజిటల్ సాధికారిత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. బుధవారం యూపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సప్లిమెంటరీ బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇస్తూ యూపీ సీఎం యోడీ పై హామీలు గుప్పించారు.
ముఖ్యమంత్రి సమాధానం అనంతరం రూ.7,301 కోట్ల సప్లిమెంటరీ బడ్జెట్‌కు మూజువాణి ఓటుతో ఆమోదముద్ర పడింది. అంతకుముందు అసెంబ్లీ మాట్లాడిన యూపీ సీఎం.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర యువతను అస్సలు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. దాంతో వారు బలవంతంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడి జైలు పాలయ్యేవారని చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర యువత అభివృద్ధిని కోరుకుంటున్నదని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేకపోవడంవల్ల గతంలో రాష్ట్ర యువత ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే బయపడేవారని, కానీ, ఇప్పుడు దేశంలో ఎక్కడికైనా వెళ్తున్నారని, తాను యూపీకి చెందిన వ్యక్తిని అని గర్వంగా చెప్పుకుంటున్నారని యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర యువతలో డిజిటల్ సాధికారతను కోరుకుంటున్నదని, తాజా బడ్జెట్లో రూ.3,000 కోట్లు యువత కోసమేనని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

