Watch: బైక్‌పై స్టంట్స్ చేసిన పోలీస్.. రీల్ పోస్ట్ చేయడంతో సస్పెండ్
Constable bike stunts | ఒక పోలీస్ కానిస్టేబుల్ బైక్‌పై స్టంట్స్ (Police bike stunts) చేశాడు. అంతేగాక వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీస్ అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ను సస్పెండ్ చేశారు.
లక్నో: ఒక పోలీస్ కానిస్టేబుల్ బైక్‌పై స్టంట్స్ (Police bike stunts) చేశాడు. అంతేగాక వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీస్ అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ సందీప్ కుమార్ చౌబే, రేసింగ్ బైక్‌పై విన్యాసాలు చేశాడు. అంతేగాక ఒక వీడియో క్లిప్‌ను రికార్డ్ చేశాడు. ‘నీకు శత్రువులంటే భయం లేదా?’ అని ఒక అమ్మాయి అడుగుతుంది. దీనికి అతడు బదులిస్తాడు. ‘శత్రువులంటే భయం ఎందుకు? చావు అంటే ఏమిటి? ఈరోజు కాకపోతే రేపైనా మనం చనిపోతాం. భయపడాలంటే దేవుడికి భయపడండి. కీటకాలు, స్పైడర్లకు ఎందుకు భయపడతారు?’ అని ప్రశ్నిస్తాడు. ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన కానిస్టేబుల్ సందీప్ కుమార్ చౌబేపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అతడ్ని సస్పెండ్ చేశారు.
गोरखपुर
➡️सिपाही का रील वीडियो सोशल मीडिया पर वायरल
➡️सोशल मीडिया पर रील वीडियो बनाकर डाला था
➡️अनुशासन तोड़ वर्दी में और बिना हेलमेट बनाया वीडियो
➡️वायरल वीडियो का संज्ञान लेकर की गई कार्रवाई
➡️कैण्ट थाने में तैनात सिपाही को किया गया सस्पेंड.#Gorakhpur @gorakhpurpolice… pic.twitter.com/GfPZpQO5rX
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

