కాట్మాండు: నేపాల్‌లో సంభవించిన ఆక్మసిక వరదల(Nepal Floods)కు కారణం ఏంటన్న దానిపై అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటన చేసింది. టిబెట్ వైపు ఉన్న హిమాలయ పర్వతంలోని మంచు కొండ విరిగిపడడం వల్ల.. శిథిలాలు, బురుదతో కూడిన వరద విలయం వచ్చినట్లు పేర్కొన్నది. ముందుగా అంచనా వేసినట్లు భూకంపం కాదు అని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మంచుపర్వతం బద్దలు కావడం.. దాంతో బురద నీరు మహోగ్రంగా పోటెత్తిందని.. ఆ ప్రవాహం దిగువ ప్రాంతాలను ముంచెత్తినట్లు ఆ సంస్థ తెలిపింది. బుధవారం టిబెట్‌లో 4.4 తీవ్రతతో భూకంపం రావడం వల్ల .. జల విలయం సంభవించినట్లు తొలుత యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. కానీ మరింత విశ్లేషణ తర్వాత తమ ప్రకటనలో మార్పు చేశారు.
❗️ More Horrifying Footage Shows Gigantic Mudslide Engulfing China’s Gyirong Region – WARNING: Distressing 📹
‘Major casualties’ are feared after infrastructure was completely obliterated in the major border crossing between China and Nepal. (Xinhua) https://t.co/lct3g9fOIc pic.twitter.com/M1NzVj0Naq
— RT_India (@RT_India_news) August 26, 2026
సమీపంలో ఉన్న సెసిమిక్ స్టేషన్లు, సెసిమిక్ వేవ్స్, శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా తాజా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మంచుశిఖరం కుప్పకూలడంతో.. భీకర స్థాయిలో బురద పోటెత్తినట్లు గుర్తించారు. భూకంపం ఏమీ సంభవించలేదని యూఎస్జీఎస్ తాజాగా పేర్కొన్నది. నేపాలీ అధికారులు కూడా ఇదే తరహా వివరణ ఇచ్చారు. హిమాలయ శిఖరంపై ఉన్న మంచు ఫలకం కుప్పకూలిందని, ఆ భారీ శిథిలాలతో రాళ్లు కూడా కొట్టుకువచ్చాయని నేపాలీ అధికారులు చెప్పారు. ప్లానెట్ ల్యాబ్స్‌కు చెందిన శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా కూడా ఓ అంచనా వేశారు.
⚠️ Extremely Distressing Footage Shows Mudslide Sweeping Up Fleeing Citizens, Cars, & Buildings On China-Nepal Border
Viewer discretion.
📹 @mcudirector https://t.co/RV9HxrYyP4 pic.twitter.com/pFtKSs5v42
— RT_India (@RT_India_news) August 26, 2026
రసువా-రసువాగాదీ బోర్డర్ క్రాసింగ్‌కు ఈశాన్య ప్రాంతంలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో మంచుపర్వతంపై కొండచరియలు విరిగిపడ్డాయని నేపాలీ అధికారులు పేర్కొన్నరు. అయితే బోటెకోశికి ఉప నది అయిన లిండే నదిలో ఆ కొండచరియల వల్ల డ్యామేజ్ అయ్యిందని, అక్కడ నుంచి బురద వరద తిమూరు నుంచి త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. నదీ వ్యవస్థలోకి బురద ప్రవేశించడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించినట్లు ఇంటర్నేషన్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటేన్ డెవలప్మెంట్ పేర్కొన్నది.
❗Nepal Floods: At Least 7 Dead, Security Personnel Missing 🇳🇵
The worst-hit areas include Timure and Syabrubesi in Rasuwa, where floodwaters have swept away homes, bridges and parts of a key road towards the China border, according to The Kathmandu Post.
Nine Armed Police… https://t.co/OGz6YNAMPx pic.twitter.com/XRGgZGxHj7
— RT_India (@RT_India_news) August 26, 2026
అయితే త్రిశూలీ నది మార్గంలో ఎక్కడైనా తాత్కాలికంగా బ్లాకేజీలు ఏర్పడ్డాయా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా బ్లాకేజీ ఉంటే, దాని వల్ల సెకండ్ ఫ్లడింగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మంచుపర్వతంపై ఉన్న సరస్సు ఆకస్మికంగా ఖాళీ అయ్యిందా లేక నది మార్గంలో బ్లాకేజీల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయా అన్న కోణంలో కూడా స్టడీ చేస్తున్నారు.
Apocalyptic view of the flash flood that struck northern Nepal and Tibet today.
A bridge collapsing under the fury of the water. pic.twitter.com/YdHjZ2SwPQ
— Massimo (@Rainmaker1973) August 26, 2026