Fish food | దేశంలో విరివిగా పెరిగిన చేపల వినియోగం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Fish food | కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెరిగినట్లు తాజాగా జరిగిన అధ్యయనం వెల్లడించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ICAR) లాంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి వరల్డ్ ఫిష్, ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IFPRI) ఈ అధ్యయనం చేసింది.
Fish food : కాలం మారుతున్నా కొద్ది ప్రజల ఆహార, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెరిగినట్లు తాజాగా జరిగిన అధ్యయనం వెల్లడించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ICAR) లాంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి వరల్డ్ ఫిష్, ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IFPRI) ఈ అధ్యయనం చేసింది.
2005-06 నుంచి 2020-21 నడుమ జరిగిన ఈ అధ్యయనంలో.. దేశంలో చేపల ఉత్పత్తి కూడా రెట్టింపై 14.164 మిలియన్ టన్నులకు చేరినట్లు తేలింది. దేశీయ వినియోగం 2005-2006లో 82.36 శాతం ఉండగా, 2019-2020 నాటికి 83.65 శాతానికి చేరింది. మిగతా మొత్తం ఆహారేతర అవసరాలకు, ఎగుమతులకు ఉపయోగించినట్లు వెల్లడైంది. ఇదిలావుంటే.. స్థానిక వినియోగానికి చేపలు, చేపల ఉత్పత్తుల దిగుమతి కూడా గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం పేర్కొంది.
స్థానికంగా లభించే, దిగుమతి చేసుకున్న చేపలను పరిగణనలోకి తీసుకుంటే.. దేశీయ మార్కెట్లో వినియోగించే చేపల మొత్తం పరిమాణం 120 శాతం పెరిగి 5.428 మిలియన్ టన్నుల నుంచి 11.924 మిలియన్ టన్నులకు పెరిగింది. తాజా అధ్యయనం ప్రకారం.. త్రిపురలో అత్యధికంగా చేపల వినియోగదారులు 99.35% ఉన్నారు. ఇక హర్యానాలో అత్యల్పంగా 20.55% మంది మాత్రమే చేపలను ఆహారంగా తీసుకుంటున్నారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ, గోవాలలో చేపలు తినే జనాభా 90 శాతానికి పైగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, రాజస్థాన్లలో ఈ గణాంకాలు 30 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
కేరళ (53.5%), గోవా (36.2%) రాష్ట్రాల్లో రోజూ చేపలే తినేవారు ఎక్కువగా ఉన్నారు. వారానికి ఒకరోజు చేపలు తినేవారు అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో అధికంగా 69 శాతం చొప్పున ఉన్నారు. దేశంలో వార్షిక తలసరి చేపల వినియోగం 2029 – 2030 నాటికి 19.8 కిలోలకు పెరుగుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధిరేటు కంటే చేపల వినియోగం వేగంగా పెరుగుతున్నట్లు పేర్కొంది. ప్రజల్లో ఆరోగ్యస్పృహ విస్తరించడం ఇందుకు కారణంగా పరిశోధకులు అంచనా వేశారు.
భారత్లో చేపలకు పెరుగుతున్న డిమాండుతో ప్రపంచంలో చేపలను అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశంగా ఉన్నదని, అయితే ప్రపంచవ్యాప్తంగా చేపల సగటు వినియోగంతో పోల్చితే మనమింకా వెనుకబడే ఉన్నామని ICAR డైరెక్టర్ జనరల్ హిమాంశు పాఠక్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

