JD Vance | వచ్చేవారం భారత్‌కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్
JD Vance | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. సమాచారం మేరకు.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు ఇటలీ, భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తున్నది.
JD Vance | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. సమాచారం మేరకు.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు ఇటలీ, భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తున్నది. ఇరుదేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చిస్తారని ఉపాధ్యక్షుడి కార్యాలయంలో ప్రకటనలో పేర్కొంది. పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో సహా భారత్‌లో పర్యటించనున్నారు. వాన్స్ కుటుంబం న్యూఢిల్లీతో పాటు స్వస్థలం జైపూర్‌తో పాటు ఆగ్రాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. సెకండల్ లేడి ఉష వాన్స్ తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970 చివరలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఆమె అక్కడే జన్మించారు.
సుంకాల ఆందోళనల మధ్య జేడీ వాన్స్ భారత్‌లో పర్యటించబోతున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్ సైతం వచ్చే వారంలో భారత్ పర్యటించాలని భావించని.. వాయిదాపడింది. జేడీ వాన్స్ ఏప్రిల్ 21న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై.. పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. సుంకాల సమస్య, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య జరుగుతున్న చర్చలతో సహా భారత్-అమెరికా సంబంధాల తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇద్దరు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.
అమెరికా సెకండల్ లేడీ ఉషా చిలుకూరి తెలుగువారే. ఆమె పూర్వీకులు ఏపీలోని కృష్ణాజిల్లా పామర్రుకి దగ్గరలోని ఓ గ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970 చివరలో అమెరికాకు వలస వెళ్లారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీరంగంలో నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూనే శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ పదవిలో కొనసాగుతున్నారు. తండ్రి రాధాకృష్ణ.. క్రిష్ చిలుకూరిగా సుపరిచితం. ఆయన ఏరోస్పేస్ ఇంజినీర్ కాగా.. యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా సేవలందించారు. ఆ తర్వాత కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

