Long Covid | యావత్ ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన కరోనా వైరస్ (Corona Virus) ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. వైరస్ కారణంగా పుట్టుకొచ్చిన సబ్ వేరియంట్లతో గత మూడేళ్లుగా ప్రజలు ఆరోగ్య, ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, వైరస్ బారిన పడిన కొందరు ప్రస్తుతం లాంగ్ కొవిడ్ (Long Covid )తో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ (omicron) సబ్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కొవిడ్ బయటపడుతోందని అమెరికా అధ్యయనం (US study)లో తాజాగా వెల్లడైంది. కొవిడ్ సోకిన ప్రతీ పది మందిలో ఒకరు ఇప్పటికీ అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతవుతున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (National Institutes of Health) తన అధ్యయనంలో పేర్కొంది.
చిన్న పనికే అలసిపోవడం, మెదడుపై ప్రభావం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, సెక్స్‌పై ఆసక్తి ఉండకపోవడం, తరచూ దాహం వేయడంతోపాటు రుచి, వాసన కోల్పోవడం వంటివి లాంగ్ కొవిడ్ లక్షణాలుగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. దీంతోపాటు విపరీతమైన దగ్గు, ఛాతిలో నొప్పి వంటివన్నీ లాంగ్ కొవిడ్ ఉన్న వారిలో కనిపిస్తున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తన నివేదికలో వివరించింది.
Also Read..
Baba Ramdev | రెజ్లర్లకు బాబా రాందేవ్ మద్దతు.. బ్రిజ్ భూషణ్‌ను జైల్లో పెట్టాలని డిమాండ్
America | అమెరికాలో ఫెడరల్ హాలిడేగా దీపావళి.. చట్టసభలో బిల్లు