Arun Yogiraj | అయోధ్య బాలరాముడి శిల్పికి షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
Arun Yogiraj | అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరించింది.
బెంగళూరు: అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు (Arun Yogiraj) చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరించింది. వర్జీనియాలోని రిచ్మండ్లో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్ 2024 ఈవెంట్ జరుగనున్నది. అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా దీనిని నిర్వహిస్తున్నది. కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ఈ సదస్సుకు ఆహ్వానించారు.
కాగా, కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అమెరికా వీసా కోసం రెండు నెలల కిందట అరుణ్ యోగిరాజ్ దరఖాస్తు చేశారు. అయితే ఆయన వీసాను తిరస్కరించినట్లు ఆగస్ట్ 10న అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. వీసా నిరాకరణకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.
మరోవైపు వీసా తిరస్కరణ విషయం తెలుసుకున్న అరుణ్ యోగిరాజ్, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అలాగే రిచ్మండ్లో జరుగనున్న ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం లేకపోవడంపై నిరాశ చెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

