Zika Virus | కాన్పూర్ను వణికిస్తున్న జికా వైరస్..
Zika Virus | ఉత్తరప్రదేశ్‌లో జిహా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. ఒక్క కాన్పూర్ పట్టణంలోనే ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో జిహా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. ఒక్క కాన్పూర్ పట్టణంలోనే ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 96 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. మరో మూడు కేసులు లక్నోలో, ఒక కేసు కన్నౌజ్‌లో నమోదయిందని వెల్లడించారు. వైరస్ ఎలా, ఎవరి వల్ల వ్యాప్తి చెందిందనే విషయాన్ని తెలుసుకుంటున్నామన్నారు.
కాన్పూర్‌లో మొదటి జికా వైరస్ కేసు అక్టోబర్ 23న నమోదయింది. నగరంలో తొలిసారిగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన వారెంట్ ఆఫీసర్‌లో వైరస్ లక్షణాలను గుర్తించారు. పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది. కాగా, గత కొన్ని వారాలుగా జికా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

