లక్నో: ఒక వ్యక్తి వెనుక పటాకులు కాల్చడంతో అతడు కుప్పకూలి మరణించాడు. (man dies after firecrackers thrown at him) ఈ సంఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం లింక్ రోడ్ ప్రాంతంలో దీపావళి సందర్భంగా ఒక వీధిలో కొందరు వ్యక్తులు ఉన్నారు. 40 ఏళ్ల వ్యక్తి, మరొకరు వారి వద్దకు వెళ్లారు. మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగారు. ఇంతలో ఆ గుంపులోని ఒకరు 40 ఏళ్ల వ్యక్తి వెనుక పటాకులు కాల్చాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు.
కాగా, మృతుడ్ని 40 ఏళ్ల నాటు అలియాస్ అఫ్జల్‌గా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారిలో ఉన్న నిందితుడు ప్రదీప్ కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
गाजियाबाद में प्रदीप ने अफजाल के पीछे लोहे की नाल से गंधक–पोटाश का धमाका किया। अफजाल की मौत हुई। प्रदीप के खिलाफ गैर इरादतन हत्या का केस दर्ज। #Ghaziabad #Up pic.twitter.com/jcoV7czKCM
— Sachin Gupta (@SachinGuptaUP) November 13, 2023