e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home News Rajya Sabha: టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌.. సభ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా

Rajya Sabha: టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌.. సభ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా


న్యూఢిల్లీ: రాజ్య‌స‌భ ( Rajya Sabha ) వ‌రుస‌గా మూడో రోజు కూడా విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడికింది. టీఆర్ఎస్ ఎంపీల‌తోపాటు ఇత‌ర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేక‌ర‌ణ‌, పంట‌ల‌కు క‌నీస మ‌ద్దతు ధ‌ర‌, ఆందోళ‌నల్లో మ‌ర‌ణించిన రైతుల‌కు ప‌రిహారం విష‌య‌మై స‌భ‌లో నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఛైర్మ‌న్ పోడియాన్ని చుట్టుముట్టారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. విప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో ఛైర్మ‌న్ రాజ్య‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement