UPI Payments: మొరాయించిన గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం .. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ పేమెంట్స్
UPI Payments: యూపీఐ లావాదేవీలకు టెక్నికల్ సమస్య వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం యూపీఐ పేమెంట్స్ జరగలేదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ సంస్థలన్నీ మొరాయించాయి. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైంది.
హైదరాబాద్: డిజిటల్ పేమెంట్ సర్వీసుల( UPI Payments)కు ఇవాళ బ్రేక్ పడింది. ఉదయం నుంచి యూపీఐ పేమెంట్స్ సరిగా జరగడం లేదు. దేశవ్యాప్తంగా ఇవాళ ఆ సమస్య ఉత్పన్నమైంది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సిస్టమ్ మొరాయిస్తున్న నేపథ్యంలో.. ఆన్లైన్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, హోటళ్ల వద్ద.. యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి. ఒకవేళ పేమెంట్ చేసినా.. ఎర్రర్ అని లేదా పెండింగ్ అని చూపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా యూపీఐ సమస్యలు వస్తున్నట్లు.. సోషల్ మీడియా యూజర్ల ద్వారా స్పష్టమవుతోంది. బిల్ పేమెంట్స్ దగ్గర సమస్య రావడంతో.. అందరూ క్యాష్ అడుగుతున్నారు. దీంతో కొందరు కస్టమర్లు వెనుదిరిగి పోవాల్సి వస్తోంది. డౌన్‌డిటెక్టర్ వెబ్సైట్ ద్వారా యూఐపీ పేమెంట్ సమస్యలు వెల్లడయ్యాయి. ఆ వెబ్సైట్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం వేళ పేమెంట్స్ సమస్యలు తీవ్రంగా వచ్చినట్లు తెలుస్తోంది.
పేమెంట్స్ చేయడంలో సుమారు 66 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 34 శాతం మందికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం కష్టంగా మారింది. చాలా వరకు బ్యాంకులు, యాప్‌ల్లో ఈ సమస్య తలెత్తింది. అయితే ఏ కారణం చేత .. యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయో ఇంత వరకు స్పష్టం కాలేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ దిగ్గజ యూపీఐ ప్లాట్‌ఫామ్స్ కానీ దీనిపై వివరణ ఇవ్వలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

