బులంద్‌షహర్: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది. యూపీ మంత్రి, శిఖర్పూర్ అసెంబ్లీ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ఖుష్ డబ్బులు పంచిపెడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఓటర్లకు తన వాహనం దగ్గర్లో ఖుష్ రూ.100 నోట్లు పంచిపెడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో 24 గంటల్లో వివరణ ఇవ్వాల్సిందిగా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మంత్రికి నోటీసులు జారీ చేశారు.