Chicken | భార్య చికెన్ వండలేదని.. ఆత్మహత్య చేసుకున్న భర్త
Chicken | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భార్య చికెన్ వండలేదన్న (cook chicken) కారణంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గత గురువారం రాత్రి ఝాన్సీ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Chicken | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భార్య చికెన్ వండలేదన్న (cook chicken) కారణంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గత గురువారం రాత్రి ఝాన్సీ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పవన్, ప్రియాంక దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరు రెండేళ్ల కుమార్తెతో కలిసి ప్రేమ్ నగర్ (Prem Nagar ) ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పవన్ స్థానికంగా ఉండే ఫర్నీచర్ షాప్లో పనిచేస్తున్నాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ చోటు చేసుకునేది. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చిన పవన్.. ఇంట్లో చికెన్ కూర వండమని భార్యకు చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. అప్పటికే వంట వండేశానని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ప్రియాంక కుమార్తెతో కలిసి గదిలోకి వెళ్లి నిద్రపోయింది. భార్య పడుకున్న తర్వాత ఇంట్లోని వేరే గదిలో పవన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొన్ని గంటల తర్వాత మృతిడి సోదరుడు వచ్చి చూడగా పవన్ అప్పటికే మృతి చెంది కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Restaurant | ఫుడ్ ప్యాకెట్లోకి ఉమ్మివేసిన రెస్టారెంట్ ఉద్యోగి
Baba Ramdev | రెజ్లర్లకు బాబా రాందేవ్ మద్దతు.. బ్రిజ్ భూషణ్ను జైల్లో పెట్టాలని డిమాండ్
teacher chops students hair | 30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్.. దర్యాప్తునకు ఆదేశం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

