Restaurant | ఓ రెస్టారెంట్ (Restaurant) ఉద్యోగి ఫుడ్ ప్యాకెట్ (food packet) లో ఉమ్మి వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఘజియాబాద్ (Ghaziabad )లో వెలుగు చూసింది.
నగరంలోని ఓ ప్రాంతంలో గల ఫుడ్ అవుట్‌లెట్‌లో ఇద్దరు ఉద్యోగులు ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారు. అందులో నిలబడిన వ్యక్తి ఫుడ్‌ను ప్యాక్ చేస్తూ అందులో ఉమ్మి వేస్తూ ( spitting) కనిపించాడు. అక్కడే ఉన్న కొందరు చాటుగా వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Baba Ramdev | రెజ్లర్లకు బాబా రాందేవ్ మద్దతు.. బ్రిజ్ భూషణ్‌ను జైల్లో పెట్టాలని డిమాండ్
IIFA Rocks 2023 | అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన బీటౌన్ తారలు
Long Covid | ఒమిక్రాన్‌తో ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కొవిడ్.. లక్షణాలు ఏంటంటే..?