teacher chops students hair | 30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్.. దర్యాప్తునకు ఆదేశం
teacher chops students hair | అందరి ముందు టీచర్ తమ జుట్టును కట్ చేయడంపై ఆ విద్యార్థులు అవమానంగా భావించారు. తాము స్కూల్‌కు వెళ్లబోమంటూ కొందరు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆ స్కూల్‌కు వెళ్లి ఈ విషయంపై టీచర్లను నిలదీశారు. అయితే తమ చర్యను స్కూల్ ఉపాధ్యాయులు సమర్థించుకున్నారు.
గువాహటి: ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించాడు (teacher chops students hair). దీంతో ఆ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై వివాదం రాజుకున్నది. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. మజులి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ స్కూల్లో గురువారం ఉదయం విద్యార్థులు ప్రేయర్ కోసం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిక్కీ అనే టీచర్ జుట్టు ఎక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించాడు. 30 మంది విద్యార్థుల హెయిర్‌ను అతడు కట్ చేశాడు.
కాగా, అందరి ముందు టీచర్ తమ జుట్టును కట్ చేయడంపై ఆ విద్యార్థులు అవమానంగా భావించారు. తాము స్కూల్‌కు వెళ్లబోమంటూ కొందరు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆ స్కూల్‌కు వెళ్లి ఈ విషయంపై టీచర్లను నిలదీశారు. అయితే తమ చర్యను స్కూల్ ఉపాధ్యాయులు సమర్థించుకున్నారు. నిబంధనల్లో భాగంగా జుట్టు ఎక్కువగా ఉన్న విద్యార్థులపై ఈ మేరకు క్రమశిక్షణ కింద చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే స్కూల్ అధికారుల సూచనతోనే తాను విద్యార్థుల హెయిర్ కట్ చేసినట్లు టీచర్ నిక్కీ తెలిపాడు.
మరోవైపు ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో 30 మంది విద్యార్థుల జుట్టును ఉపాధ్యాయుడు కట్ చేసిన అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అలాగే విద్యార్థుల జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ స్కూల్లో కత్తిరించాలన్న మార్గదర్శకాలు ఎక్కడా లేవని అన్నారు. ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

