Watch: రైఫిల్‌ను లోడ్ చేయమన్న డీఐజీ.. ఒక పోలీస్ అధికారి ఏం చేశాడంటే?
ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)కి రైఫిల్‌లో బుల్లెట్‌ను ఎలా లోడ్ చేయాలో కూడా తెలియలేదు. బుల్లెట్‌ను రైఫిల్ ముందు భాగం నుంచి లోపలకు నెట్టాడు.
లక్నో: రైఫిల్‌ను లోడ్ చేయమని ఒక పోలీస్ అధికారిని డీప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) అడిగారు. అయితే ఆ పోలీస్ అధికారి రైఫిల్ ముందు భాగం నుంచి బుల్లెట్‌ను లోడ్ చేశాడు. ఇలా చేస్తే కాల్పులు జరిపినప్పుడు ఎవరికీ గాయాలు కావని చెప్పాడు. ఆ పోలీస్ అధికారి చేసిన పని చూసి డీఐజీతోపాటు అక్కడ ఉన్న మిగతా పోలీస్ అధికారులు నవ్వుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డీఐజీ ఆర్కే భరద్వాజ్ ఒక పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో ఉన్న రైఫిల్ ఎలా వినియోగిస్తారో చూపాలని అక్కడున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అడిగారు.
కాగా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)కి రైఫిల్‌లో బుల్లెట్‌ను ఎలా లోడ్ చేయాలో కూడా తెలియలేదు. బుల్లెట్‌ను రైఫిల్ ముందు భాగం నుంచి లోపలకు నెట్టాడు. అనంతరం ఆ రైఫిల్‌ను పైకి ఎత్తి పట్టుకున్నాడు. ఈ విధంగా కాల్పులు జరిపితే ఎవరికీ గాయం కాదంటూ తనిఖీ కోసం వచ్చిన డీఐజీకి చెప్పాడు. బుల్లెట్‌ను ఎలా అన్లోడ్ చేస్తావని ఆ ఎస్ఐని అడగ్గా, రైఫిల్‌ను కిందకు వంచడంతో అది బారెల్ నుంచి జారి వచ్చింది. ఇది చూసి ఆ డీఐజీతోపాటు అక్కడ ఉన్న మిగతా పోలీస్ అధికారులు నవ్వు కున్నారు.
మరోవైపు రైఫిల్‌లో బుల్లెట్లు ఎలా లోడ్ చేయాలో అన్నది నేర్చుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ పొందేలా శిక్షణ పొందాలని ఆ ఎస్ఐకి డీఐజీ సూచించారు. అయితే ఆ పోలీస్ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అన్నది తెలియలేదు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Viral Video: UP Cop Was Asked To Load A Gun.
OMG😜😜😜#UPPolice #ViralVideo pic.twitter.com/AHek8iGFdC— pratiksha (@Pratikshashrii) December 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gun Load
- UP Cop
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

