handcuffed prisoner | చేతికి సంకెళ్లున్న ఖైదీ మద్యం కొనుగోలు.. సహకరించిన పోలీస్
handcuffed prisoner | ఒక కేసులో అరెస్టై జైలులో ఉన్న ఖైదీ లిక్కర్ షాపు వద్ద మద్యం కొన్నాడు. ఒక పోలీస్ దీనికి సహకరించాడు. ఈ వీడియో క్లిప్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: ఒక కేసులో అరెస్టై జైలులో ఉన్న ఖైదీ లిక్కర్ షాపు వద్ద మద్యం కొన్నాడు. ఒక పోలీస్ దీనికి సహకరించాడు. ఈ వీడియో క్లిప్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక కేసులో అరెస్ట్ చేసి జైలుకు తరలించిన వ్యక్తిని కోర్టు విచారణ కోసం పోలీసులు బయటకు తీసుకొచ్చారు. అయితే సంకెళ్లతో ఉన్న ఆ ఖైదీ (handcuffed prisoner) మార్గమధ్యలో మద్యం షాపు వద్ద లిక్కర్ కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి వెంట ఉన్న ఒక పోలీస్ దీనికి సహకరించాడు. అటుగా వెళ్తున్న ఒకరు తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. దీంతో ఈ వీడియో క్లిప్‌తోపాటు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో హమీర్పూర్ జిల్లా ఎస్సీ ఈ సంఘటనపై స్పందించారు. చేతికి బేడీలున్న ఖైదీ లిక్కర్ షాపు వద్ద మద్యం కొనడం, దానికి పోలీసులు సహకరించడంపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఆ వ్యక్తి వెంట ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.
थाना कुरारा क्षेत्र अंतर्गत पीआरडी द्वारा मुलजिम को शराब दिलाने की घटना के संबंध में पुलिस अधीक्षक हमीरपुर द्वारा दी गई बाइट::- pic.twitter.com/dfiVTDp29g
— HAMIRPUR POLICE (@hamirpurpolice) April 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

